ఆ హాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా చాలా వేదనకు గురైంది సమంత .ఇక ఈ డిప్రెషన్ నుండి బయట పడేందుకు సమంతకి చాలా సమయం పట్టింది. ఆ సమస్య తర్వాత మరొక సమస్య ఆమెను వెంటాడింది.  సమంత మయోసైటీస్ అనే ఒక అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. దీంతో సమంత ఇలాంటి ఒక  వ్యాధితో గురి కావడంతో ఆమె అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె సన్నిహితులు చిత్ర వర్గాలు సమంతా త్వరగా వ్యాధి నుంది కోలుకోవాలని వేడుకున్నారు. 

ఇక ఆ వ్యాధి కారణంగా సమంత దాదాపు 5 నెలలు షూటింగ్స్ కి దూరమైంది. ఇంట్లోనే ఉండి ఆ వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకుంది. ఆ వ్యాధి కొంచెం మెరుగుపడ్డ తర్వాత వెంటనే మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అయింది సమంత. ఖుషి సెటాడేల్ సినిమాల షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటుంది సమంత .దర్శకుడు శివ నిర్వనా దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెలగక్కబోతోంది.కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే ఇక ఆమె నటిస్తున్న సిటాడెల్  సిరీస్ హాలీవుడ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది సమంత.

 ఇక ఇందులో సమంతతో పాటు వరుణ్ భావన్ మరక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సమంత ఇప్పటికే చాలా కష్టపడుతూ వస్తోంది. కఠిన యాక్షన్ స్టన్స్ చేసేందుకు ట్రైనింగ్స్ తీసుకొని స్వయంగా తానే చేస్తోంది. ఇటీవల షూటింగ్లో భాగంగా సమంత చేతిలోకి ఆయన గాయాలను చూపించిన సంగతి చాలా మందికి తెలిసిందే .ఇదిలా ఉంటే తాజాగా చిన్న సమాచారం అంతా ఒక హాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చెన్నై స్టోరీ టైటిల్ తో ఒక ఇంగ్లీష్ సినిమా రాబోతుందట. ఇక ఆ సినిమాలో సమంత హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో లండన్ అబ్బాయికి చెన్నై అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అని అంటున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ హీరో నటుడు వివేక్ కాల్రా నటిస్తున్నారట. దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్లో వరుస సినిమాలో చేస్తూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ఇప్పుడు హాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: