కాస్లీ కారు కొన్న కియార.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లలో ఉన్న టాప్ హీరోయిన్లలో కీరా అద్వానీ కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు .ఎన్నో హిట్ సినిమాలలో నటించి అందరినీ ఆకట్టుకుంది కీరా అద్వానీ .ఇక తెలుగులో భరత్ అనే నేను సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ .మొదటి సినిమాతోనే తెలుగులో కూడా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం అవకాశాలు ఆమెకి అంతగా రాలేదు. 

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ అనే సినిమాలో సైతం హీరోయిన్గా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో తిరిగి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్సి 15 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈమె. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా ఇప్పుడే పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే తన ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది ఈమె. మ్యారేజ్ తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే రామ్ చరణ్ సినిమా తర్వాత మరొక టాలీవుడ్ సినిమాలో కూడా కీయరా నటిస్తోంది అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు విషయం ఏంటంటే తాజాగా ఈ చిన్నది ఓ కాస్ట్లీ కారు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.  అయితే ఆ కార్ విలువ దాదాపుగా భారత మార్కెట్లో మూడు కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం . ఇక ఈ కారును మే 26న తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటుందట ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: