టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ గడుపుతోంది సమంత. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోగా ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత అప్పుడే తల్లి పాత్రలు నటించబోతోంది అని తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ లో కాదు.బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కు తల్లి పాత్రలో నటించబోతోంది సమంత .
అయితే వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక హాలీవుడ్ కోసం చేస్తూ ఉంటే సమంత ఇండియన్ వెర్షన్ లో చేస్తోంది. ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించిన హాలీవుడ్ మొదటి సీజన్ ఇప్పటికే విడుదలైంది. అంతేకాదు మొదటి సీజన్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది. కానీ ఇండియన్ వెర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే చాలామంది ఇండియన్ వెర్షన్ కు హాలీవుడ్ వెర్షన్ అని అనుకున్నారు. కానీ అలా కాదట. ఫ్రీక్వల్ అని అంటున్నారు. అంటే ప్రియాంక చోప్రా తల్లిదండ్రులుగా వరుణ్ సమంత ఇందులో కనిపించపోతున్నట్లుగా తెలుస్తోంది .
అయితే ఇందులో ప్రియాంకకు ఒక తండ్రి ఉంటాడు. ఆయన కూడా సీతాడేల్ ఏజెంట్. ఇక తన కూతుర్లను ఆయన ఆమె తాత దగ్గర పెంచినట్లుగా చెప్తాడు. అయితే ఇప్పుడు ఇండియన్ వెర్షన్ లో ప్రియాంక తల్లిదండ్రుల కథను చెప్పనున్నారట. 1990 కాలంలో.ఈ కద ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఈ సీక్వెల్ ఉండబోతుందని అంటున్నారు. ఇక అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ఇండియన్ వెర్షన్ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సిరీస్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!!