విమర్శలకు గురి అవుతున్న రాజమౌళి....!!

murali krishna
మంచి చేయడానికి వెళితే చెడు ఎదురయింది అనేసామెత కొన్నిసార్లు మన జీవితంలో సరిగా మనకు సరిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ సామెత దర్శక ధీరుడు రాజమౌళికి కూడా కరెక్ట్ గా సెట్ అవుతుందని తెలుస్తోంది.
ఏదో చిన్న సినిమాలకు మంచి సపోర్ట్ లభించాలన్న ఉద్దేశంతో ఈయన మేం ఫేమస్ సినిమాకి తన వంతు సహాయంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఒక ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కారణంగా రాజమౌళి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా డబ్బులు తీసుకొని మరి సినిమాని ఇలా ప్రమోట్ చేస్తున్నారని నింద కూడా మోస్తున్నారు.
సాధారణంగా రాజమౌళి ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హీరోలు సినిమాలు విడుదలైన ఆయన స్పందించరు. ఒకవేళ స్పందించారు అంటే అది తన సినిమా అయినా ఉంటుంది లేకపోతే నాచురల్ స్టార్ నాని సినిమాకి కూడా రాజమౌళి ప్రశంసలు కురిపిస్తారు. ఇంతకుమించి ఏ హీరో సినిమాలపై కూడా రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన సందర్భాలు లేవు.కానీ ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే నెగిటివ్ టాప్ సొంతం చేసుకున్నటువంటి మేమ్ ఫేమస్ సినిమా గురించి రాజమౌళి చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆయనని విమర్శలు పాలు చేస్తుంది. మేం ఫేమస్ సినిమా తనకు బాగా నచ్చిందని, చాలా కాలం తరవాత థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు రాజమౌళి. దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ కి మంచి మార్కులు వేశాడు. ఇలా ఈ సినిమాని పొగుడుతూ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే రాజమౌళి మెచ్చుకునే అంత స్థాయిలో ఈ సినిమా లేదు మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రాజమౌళి చేసిన ఈ పోస్ట్ పై కొందరు పెయిడ్ పోస్ట్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈ సినిమా కంటే ఎంతో అద్భుతంగా ఆదరణ పొందిన బలగం సినిమా రాజమౌళి దృష్టిని ఆకర్షించే లేదా అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై విమర్శలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: