20 రోజుల షూటింగ్.. 150 కోట్ల పారితోషకం?

praveen
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే అప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే స్టార్ హీరోగా కొనసాగిన ప్రబాష్ బాహుబలి సినిమాతో మాత్రం కేవలం ఇండియాలో మాత్రమే కాదు అటు వరల్డ్ వైడ్ గా కూడా మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. దీంతో ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

 ఇక ప్రభాస్ తన క్రేజ్ కి తగ్గట్టుగానే వందల కోట్ల బడ్జెట్ తో దొరికేకుతున్న భారీ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. కానీ బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ సరైనా హిట్టును ఖాతాలో వేసుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ వైవిధ్యమైన దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా తెర కెక్కుతుంది. ఈ సినిమాకు ప్రాజెక్టు కి అనే టైటిల్ పెట్టారు అనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అన్ని అప్డేట్లు కూడా ఊహించని రీతిలో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయ్. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి చిన్న విషయం బయటకు వచ్చిన అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ మారిపోతూ ఉంది.

 ఇకపోతే ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమాకు సంబంధించి ఇక ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ప్రభాస్ సినిమాలో విలక్షణ నటుడు లోకనాయకుడు కమలహాసన్ ఒక విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ చక్కర్లు కొడుతుంది.. 20 రోజులు పాటు కమలహాసన్  ప్రాజెక్టు కే షూటింగ్లో పాల్గొనబోతున్నారట. అయితే ఈ 20 రోజులకు గాను ఏకంగా 150 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడట కమల్ హాసన్. అయితే ఈ న్యూస్ బయటికి వచ్చి వైరల్గా మారిపోవడంతో  ప్రాజెక్టు కే సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి అని చెప్పాలి. ఇది ఎంతవరకు నిజము తెలియాలంటే అఫీషియల్ ప్రకటన రావాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: