4 రోజుల్లో "మేము ఫేమస్" మూవీకి వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తాజాగా సుమంత్ ప్రభాస్ అనే నటుడు మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నటుడు ఈ సినిమాలో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో ఈ మూవీ కి 1.78 కోట్ల కనెక్షన్ లు దక్కగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో 1.06 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 1.42 కోట్ల షేర్ , 2.82 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. రిమైనింగ్ ప్రాంతాల్లో ఈ మూవీ కి 84 లక్షల కలెక్షన్ లు 4 రోజుల్లో దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో 1.80 కోట్ల షేర్ , 3.66 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 2.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఈ మూవీ మరో 40 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని సక్సెస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: