టాలీవుడ్లో మహేష్ బాబుకు మాత్రమే దక్కిన అరుదైన ఘనత ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు కెరియర్ లో ఎన్నో విజయాలను అందుకున్న మహేష్ బాబు ప్రతి సినిమాలో తన విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. అంతేకాదు కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈ మధ్యకాలంలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తన సినిమాలతో కొన్ని ఏరియాల్లో సత్తా చాటిన మహేష్ బాబుకి ముఖ్యంగా ఓవర్సీస్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. 

దీంతో మహేష్ బాబు సినిమాలకు అక్కడ ఓ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. అయితే తాజాగా మహేష్ బాబు ఖాతాలో ఇప్పుడు ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ రికార్డును ఇప్పటివరకు మరే స్టార్ హీరో బ్రేక్ చేయకపోవడం విశేషం. ఇంతకీ ఆ రేర్ రికార్డు ఏమిటంటే.. ఓవర్సీస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్ ని వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటిది మహేష్ బాబు తన సినిమాలతో ఇప్పటికే 11 సార్లు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్స్ ని అవలీలగా అందుకున్నాడు. ఇప్పటివరకు ఓవర్సీస్ లో 11 సార్లు ఈ మార్క్ ను అందుకున్న ఏకైక హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

ఇక తర్వాత స్థానంలో నాచురల్ స్టార్ నాని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి హీరోలు ఉండటం విశేషం. ఇక ఇండియా వైడ్ గా చూసుకుంటే ఓవర్సీస్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ఉన్నారు. రెండవ స్థానంలో అక్షయ్ కుమార్, మూడో స్థానంలో సల్మాన్ ఖాన్, నాలుగవ స్థానంలో హృతిక్  రోషన్, అయిదో స్థానంలో అమీర్ ఖాన్, ఆరో స్థానంలో అజయ్ దేవగన్ వంటి హీరోలు ఉండగా.. ఇండియా వైడ్ గా మహేష్ బాబు ఏడవ స్థానంలో నిలిచారు. కేవలం టాలీవుడ్ పరంగా చూసుకుంటే మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు మహేష్ బాబు. మరిరాబోయే రోజుల్లో అయినా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు తమ రాబోతున్న సినిమాలతో ఓవర్సీస్ లో మహేష్ బాబు మార్క్ ని అందుకుంటారేమో చూడాలి. ఇక మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'SSMB 28' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మే 31న టైటిల్ తో పాటు టీజర్ గ్లిమ్స్ విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: