బన్నీ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 2 రిలీజ్ అప్పుడేనట..!?

Anilkumar
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు  మన టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ గా మంచి క్రేజ్ ను సైతం తెచ్చుకుంది .తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుంది .పుష్పటు పేరుతో  త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

అయితే ఇటీవల అల్లు అర్జున్ లుక్ కి సంబంధించి విడుదలైన పోస్టర్లు వీడియో ఎంతటి రెస్పాన్స్ ను అందుకుందో తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ రిలీజ్ టైం మారినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కంటే ముందుగానే అంటే ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ వార్త గనక నిజమైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు అని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లుగా జరుగుతే డిసెంబర్ 22న పుష్ప టు సినిమాని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది .అయితే గతంలో పుష్ప పార్ట్ వన్ కూడా డిసెంబర్లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అందుకే సీక్వెల్ ను సైతం డిసెంబర్ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. త్వరలోనే ఈ వార్తపై ఒక క్లారిటీ కూడా రానుంది. కాగా ఈ సినిమాలో  ఫేహాద్ ఫాజిల్  అనసూయ భరద్వాజ సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని వారి షూటింగ్ పార్ట్ ను కూడా కంప్లీట్ చేశారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: