విడాకులు తీసుకున్న స్టార్ హీరోతో పెళ్లి కి రెడీ అయిన సంయుక్త మీనన్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి భార్యగా ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించింది సంయుక్త మీనన్.కానీ ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈమె. ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని గోల్డెన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం చాలామంది స్టార్ హీరోలో ఈమెతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భీమ్లా నాయక్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈమె పేరు సౌత్ ని ఇండస్ట్రీలోనే తెగ మారుమోగుతోంది. 

ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదలై ఊహించని విజయాన్ని అందుకుంది. ఇక ఈ మధ్యకాలంలో సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్గా నటించి మరొక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. అలా ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో దర్శక నిర్మాతలు సైతం ఈమె తో సినిమా చేయడానికి ఆసక్తిచూపుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇలా సంయుక్త మీనన్ వరుస సినిమాల్లో నటించే అవకాశాలను

 అందుకోవడం వెనుక డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారని వీరిద్దరి మధ్య ఏదో సీక్రెట్ సంబంధం ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే తాజాగా సంయుక్త మీనన్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న ఒక యంగ్ హీరో పై మోజు పడిందని వార్తలు వినబడుతున్నాయి. ఆ హీరో  తిరుగుతూ క్లోజ్ గా ఉండడంతో చాలామంది కోలీవుడ్ నెటిజన్స్ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అంటున్నారు. ఒకవేళ ఇద్దరు మధ్య సీక్రెట్ సంబంధం నిజమే అయితే ఆ స్టార్ హీరోని ఈమె పెళ్లి కూడా చేసుకోబోతోందని అంటున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం సంయుక్త మీనన్ సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: