మొత్తానికి మరో కొత్త సినిమా అనౌన్స్ చేసిన అల్లు శిరీష్..!?

Anilkumar
అల్లు ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇచ్చినప్పటికీ వీరిద్దరిలో అల్లు అర్జున్ మాత్రమే హీరోగా గుర్తింపు తెచ్చుకోగలిగాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు .కాగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా హిట్ సినిమాలు లేక సతమతమవుతున్నాడు .కనీసం ఒక్క సినిమా అయినా హిట్ పడాలని ప్రయత్నిస్తున్నాడు అల్లు శిరీష్. తన అన్నకు లాగే ఆయన కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అన్న బాటలోని హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోతున్నాడు అల్లు శిరీష్. 

గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అల్లు శిరీష్. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోని శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో ఒక మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయిన అల్లు శిరీష్ ఆమధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు. అనంతరం ఊర్వశివో రాక్షసువో అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష. అయితే ఈ సినిమా పైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అల్లు శిరీష్. కానీ ఈ సినిమా కూడా ఊహించని విధంగా ఫ్లాప్ గా నిలిచింది.

అయితే తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ యంగ్ హీరో.  ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా పదేళ్లు పూర్తవుతుంది. ఇక ఈ 10 ఏళ్లలో ఏడు సినిమాలు చేశారు .తాజాగా ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ సినిమాతో మళ్లీ రాబోతున్నారు అల్లు శిరీష్. కోస్టార్ టెడ్డీబేర్ తో మెట్రో ట్రైన్ లో ఉన్న ఒక పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్ చేశాడు అల్లు శిరీష్. అయితే ఈరోజు సాయంత్రం ఆ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అల్లు శిరీష్ నటించబోతున్న ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలియదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: