పెళ్లి కి ముందు ఆ అమ్మాయిని ప్రేమించిన అల్లు అర్జున్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ .ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది .పొలిటికల్ కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరికీ అయాన్ అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు .

 అల్లు అర్జున్ మాత్రమే కాకుండా తన భార్య స్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఆక్టివ్ గానే ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకుంటూ అంటుంది స్నేహ రెడ్డి. ముఖ్యంగా తన పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదాగా ఉన్న మూమెంట్స్ వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలను ఇలా తనకి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇందుకుగాను స్నేహ రెడ్డికి తన సోషల్ మీడియాలో కూడా

 విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .ఇదిలా ఉంటే ఇక తాజాగా అందిన ఒక సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కు స్నేహ కంటే ముందే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన గర్ల్ ఫ్రెండ్ గురించి రివీల్ చేశాడు అల్లు అర్జున్. అయితే ఆహా లో ప్రసాదం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ టు ఫైనల్ షో కి గెస్ట్ గా వచ్చాడు అల్లు అర్జున్. షోలో శృతి అనే కంటెస్టెంట్ ఒక పాట పాడింది. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతినే అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైర్లవుతోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: