షకీలాను సినిమాలో తీసుకోడానికి అలా చేశాను అంటున్న డైరెక్టర్....!!

murali krishna
కొత్త టాలెంట్‌ను వెతికి వెతికి పట్టుకోవడంలో దర్శకుడు తేజ తర్వాతే ఎవరైనా. ఇప్పటివరకు ఆయన బోలెడంత మందిని ఇండస్ట్రీలోకి పట్టుకొచ్చాడు. ఉద‌య్‌కిర‌ణ్‌, నితిన్, న‌వ‌దీప్ లాంటి యువ హీరోల‌ను పరిచయం చేసిన ఘనత ఆయనదే.
రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఆయన పరిచయం చేసిన నటులు, సాంకేతిక నిపుణులు వెయ్యికి పైగామాటే అట. ఈ ఫిగర్‌ను బట్టి చూస్తే తెలుస్తుంది తేజ కొత్త వాళ్లను ఏ స్థాయిలో ఎంకరేజ్‌ చేస్తాడో అని. ఇక ఇప్పడు ఆయన తెరకెక్కించిన అహింస సైతం కొత్త వాళ్లతోనే తెరకెక్కించాడు. హీరో హీరోయిన్‌లతో పాటుగా పలువురు కొత్త ఆర్టిస్టులు కూడా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు.
సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో సినిమాపై హైప్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అహింస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా జరిపారు. ఇందులో తేజ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. దాంతో పాటు షకీలాను జయం సినిమాలో ఎలా తీసుకున్నానో కూడా అభిమానులతో పంచుకున్నాడు.
జయంకు ముందు ఐదారు సినిమాల్లో షకీలా నటించింది. కానీ అవేవి ఆమెకు పెద్దగా క్రేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే 20ఏళ్ల క్రితం వచ్చిన జయం సినిమా మాత్రం షకీలాకు తెలుగులో పేరొచ్చింది. కాగా ఆమెను జయం సినిమాలో ఎంపిక చేయడానికి రీజన్‌ ఏంటో తేజ చెప్పాడు. జయం సినిమా మొదలవడానికి ముందు తేజ.. ఆర్‌పీ పట్నాయక్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్‌లో కార్లో వెళ్తుండగా కాచిగూడలోని తారకరామా థియేటర్‌లో జనాలు కుప్పలుకుప్పులుగా గుమికూడారట. థియేటర్‌ గేట్‌లు ఓపెన్‌ చేయగానే కుర్రాళ్లందరూ లోపలికి పరుగులు తీశారట. అంతగా జనాలను పిచ్చేకించే సినిమా ఏం అయి ఉంటుందని చూస్తే కామేశ్వరి అనే పోస్టర్‌ కనిపించందట.
షకీలా ఎవరు అని అక్కడున్న వారిని అడిగితే.. వాళ్లు ఆమె గురించి చెప్పారట. అయితే ఆమెకు ఎందుకు అంత క్రేజ్‌ ఉందా అనుకుని తను కూడా టిక్కెట్‌ తీసుకుని హాల్‌లోకి వెళ్లాడట. షకీలా తెరపై కనపడగానే కుర్రాళ్లందరూ హారతులు పడుతన్నారట. ఆ క్రేజ్‌ చూసి తేజ ఆశ్చర్యపోయాడట. అదే సమయంలో జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు తనే అని ఫిక్సయిపోయినట్లు తెలిపాడు. అలా తను నటీనటులను ఎంపిక చేసే విధానం ఉంటుందని తేజ చెప్పుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించిన తేజ చిత్రం సినిమాతో మెగాఫోన్‌ పట్టాడు. తొలి సినిమానే ఆయనకు తిరుగులేని విజయాన్నిచ్చింది. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో కొంత కాలానికే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: