ఆ సమయంలో ఎంతో బాధ పడ్డాను : ప్రియాంక చోప్రా

murali krishna
బాలీవుడ్ బ్యూటీ అయిన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది ప్రియాంక చోప్రా.
ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ గతంలో అలాగే తన కెరియర్ లో జరిగిన చేదు అనుభవాల గురించి కూడా పంచుకుంటోంది. ఒక డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా మరోసారి కెరీర్ మొదట్లో ఎదురైన అనుభవం గురించి ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. 20 ఏళ్ల వయసులో నటిగా పరిశ్రమలోకి నేను అడుగుపెట్టాను. అప్పుడు ఎంతో కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరు కూడా తెలియదు. చాలా భయపడేదాన్ని.
ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్గా అయితే తీసుకునేదాన్ని. అలా మానసికంగా ఎన్నోసార్లు బాధపడ్డాను. ఏదైనా సినిమా ఫెయిల్ అయినా, లేదా ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధతో సెట్ లోకి అడుగుపెట్టడం ఎంతో కష్టంగా అనిపించేది. ఎవరినైతే టీవీలో చూస్తూ పెరిగానో అలాంటి బిగ్గెస్ట్ స్టార్స్తో నేను నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఒకవేళ ఆనాటి ప్రియాంకకు ఏమైనా చెప్పాలి అనుకుంటే.. కంగారు పడకు.. కాస్త సరదాగా జీవించు. ఇది అంత ఇబ్బందికరంగా ఉండదు. నీకు అంతా మంచే జరుగుతుంది. కొంచెం నవ్వుతూ ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించు అని చెబుతాను అని తెలిపిందటా ప్రియాంక చోప్రా. ఇకపోతే ప్రియాంక సినిమాల విషయానికొస్తే  బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్ లో వరుసగా ప్రాజెక్టులు అందుకుంటూ దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: