ఇటీవల త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ఎన్టీఆర్ 30. మల్టీ టాలెంటెడ్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. త్రిబుల్ ఆర్ సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా నిరుత్సాహానికి గురికాకుండా అదే రేంజ్ లో ఈ సినిమాని తీయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు కొరటాల శివ. ఇక ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు చేసి మరి స్పెషల్ సెట్స్ ను వేస్తున్నారు చిత్రబంధం.
ఏకంగా ఐదు కోట్లు పెట్టి బాలీవుడ్ బ్యూటీ ని రంగంలోకి కూడా దించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు జాన్వి కపూర్ ఏకంగా 5కోట్ల తీసుకుంది. అంతేకాదు కేవలం ఒక్క బాలీవుడ్ బ్యూటీ కాకుండా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ కోసం కూడా బాలీవుడ్ బ్యూటీ తో సహా మరో తొమ్మిది మంది బ్యూటీలు ఈ పాటలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ తీయని రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాస్ట్ అండ్ గ్రూప్ విషయంలో అస్సలు తగ్గట్లేదు కొరటాల శివ. ఈ సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ ఆ పాత్ర కోసం స్టార్ లని పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడట కొరటాల శివ.
అందుకోసం ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర కోసం ఒక స్టార్ హీరోని లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా లో ఆ పాత్ర సినిమా స్టార్ట్ అయిన అరగంటకి చచ్చిపోతుంది. అయినా సరే చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నాడు కొరటాల శివ.అందుకోసం మా స్టార్ హీరోకి భారీ రెమ్యూనరేషన్ సైతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు సినిమాపై మరింత ఆసక్తి పెరగాలని ఉద్దేశంతో కొరటాల శివ కనీసం ఆ స్టార్ హీరో పేరుని కూడా బయటకు రానివ్వడం లేదట. ప్రతి విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు కొరటాల శివ..!!