వరుసలు చూడను.. సొంత అన్నతో ఆ పని చేశా : షకీలా

praveen
సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాలు లేక తెరపై కనిపించకపోతే.. ఇక ప్రేక్షకులు కూడా వారిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఇలా తెరమీద కనిపించకపోయిన ప్రేక్షకులు ఎప్పుడు గుర్తుంచుకునేలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది షకీలా. నిన్నటి తరం ప్రేక్షకులకి కాదు నేటితరం ప్రేక్షకులకు కూడా షకీలా సుపరిచితురాలు అని చెప్పాలి. ఒకప్పుడు తన అందాలతో ప్రేక్షకులు అందరిని చూపు తిప్పుకోకుండా చేసింది షకీలా. 1990లో బి గ్రేడ్ మలయాళం సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది షకీలా.



 ఇక ఇలాంటి బి గ్రేడ్ సినిమాలతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది అని చెప్పాలి. ఒకప్పుడు షకీలా సినిమాలు అంటే చాలు ఇక అబ్బాయిలందరూ కూడా థియేటర్లకు పరుగులు పెట్టేవారు అనడంలో సందేహం లేదు. ఇక ఆ తర్వాత బి గ్రేడ్ సినిమాలలో మాత్రమే టాలీవుడ్ లో కూడా ఎన్నో బోల్డ్ క్యారెక్టర్లలో నటించి ఆకట్టుకుంది. అయితే తెరమీద ఎంతో హాట్ గా కనిపిస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించిన షకీలా.. నిజజీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడింది అని స్వయంగా ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా.. ఏకంగా తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను సినిమాల ద్వారా బాగానే ఆస్తులు సంపాదించినప్పటికీ నమ్మిన సొంతవాళ్లే నన్ను మోసం చేసి ఆస్తులు లాగేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ శృంగార తార అనే ముద్రవేసి చిన్నచూపు చూసింది. కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అంటూ షకీలా తెలిపింది. అయితే సినిమాల్లో నటించేటప్పుడు వావి వరసలు చూడను అంటూ చెప్పింది షకీలా. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు మా పెద్దనాన్న కొడుకు స్వయానా నాకు అన్నయ్య అయ్యే వ్యక్తితో శృంగారం సన్నివేశంలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే సొంత అన్న అని తెలిసి కూడా నేను సినిమా కోసం అలాంటి సీన్లలో నటించా.. అప్పట్లో ఆ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ షకీలా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: