ఒకప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్న కాజల్ ఇప్పుడు ఎంత తీసుకుంటుందో తెలుసా..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో సాధారణంగా ఏడాదికి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు.రావడంతో పాటు కొందరు హీరోయిన్స్ పోవచ్చు కూడా. కానీ కొంతమంది హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే వాళ్ళ అందంతో గతంలో అందరి మనసులను దోచుకున్నారు కాబట్టి.ఇక అలాంటి స్టార్ హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది కాజల్.ఇక ఆ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ సినిమాల తర్వాత అలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర సినిమాలో హీరోయిన్ ని నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో కాజల్ ఊహించని స్థాయికి చేరుకుంది. ఇక ఆ సినిమాల తర్వాత వరుసగా ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అందరి హీరోల సరసన హీరోయిన్ గా నటించింది కాజల్ అగర్వాల్. అలా నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అలాంటి ఒక స్టార్ హీరోయిన్ కి అప్పట్లో రెండు మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేవారట. కానీ ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుందో అప్పుడు నుండి కాజల్ ఒక్కో సినిమాకి 50 నుండి 75 లక్షలు మాత్రమే తీసుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం కాజల్ బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కాజల్ తో పాటు ఈ సినిమాలో శ్రీ లీల సైతం నటిస్తుంది. ఆమెకి రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్న దర్శక నిర్మాతలు కాజల్ కి మాత్రం కేవలం 70 లక్షల మాత్రమే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కాజల్ కంటే శ్రీ లీల చాలా జూనియర్. అయినప్పటికీ ఆమెకి అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఇక నెంబర్ వన్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ కి అంత తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడంతో కాజల్ అభిమానులు మేకర్స్పై విరుచుకుపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: