శాక్రిఫైజింగ్ స్టార్ ని చితక్కొట్టిన రామ్ చరణ్ ఫ్యాన్స్..!!
గత కొద్ది సంవత్సరాల నుంచి ఎక్కువగా యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇస్తూ పలు రకాలుగా మాట్లాడుతూ మంచి పాపులారిటీ సంపాదించారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. తాను ఒక సినిమా హీరోని అంటు ఫలానా సినిమాకు ఫస్ట్ ఛాయిస్ తానేనంటూ కూడా సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఎప్పుడూ కూడా తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు.సునిషిత్ చేసే స్టేట్మెంట్లు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే దీంతో యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా అతనితో ఇంటర్వ్యూ చేయడానికి పోటీ పడుతూ ఉంటాయి.
ఇలా ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా ఎన్నో వివాదాలు కూడా సృష్టించాడు సునిషిత్.. రాను రాను పలు రకాల పిచ్చిపిచ్చి స్టేట్మెంట్లతో వివాదాలను కొని మరి తెచ్చుకున్నారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. తాజాగా రామ్ చరణ్ అభిమానులు కూడా సునిషిత్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందుకు గల కారణం ఏమిటంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ భార్య ఉపాసన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఈ దాడికి కారణమన్నట్లుగా తెలుస్తోంది.
దీంతో శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్ పై దాడికి పాల్పడిన వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది .ఇందులో అతడిని కొట్టే సమయంలో మా వదిన నోటికి వచ్చినట్టు అంటావా అంటూ రాంచరణ్ అభిమానులు విరుచుకుపడడం జరిగింది ఈ దాడికి పాల్పడిన తర్వాత సునిషిత్ రామ్ చరణ్ అభిమానులను క్షమాపణలు కోరుతూ.. ఉండడమే కాకుండా తను చేసిన వాక్యాలు అనుచిత వ్యాఖ్యలని అందుకే వాళ్ళు అభిమానులు ఇప్పుడు తనపై దాడి చేశారని ఉపాసన గారి గురించి రాంచరణ్ గాని గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమించమంటూ సునిషిత్ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.