ఇలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో రెండు కమర్షియల్ విజయాలతో ఫుల్
జోష్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే
కీర్తి సురేష్ "మహానటి" అనే లేడీ ఓరియంటెడ్
మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ
మూవీ లో
దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ
మూవీ కి
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.
వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ
మూవీ అలనాటి స్టార్ కథానాయక అయినటు వంటి
సావిత్రి గారి
జీవిత కథ ఆధారంగా రూపొందింది.
ఇది ఇలా ఉంటే ఈ
సినిమా మంచి అంచనాల నడుమ 9 మే 2018 వ సంవత్సరం విడుదల అయింది. ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు
బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. ఈ
మూవీ లోని
కీర్తి నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో
బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న
మహానటి సినిమా నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.