అక్కినేని
అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులపై పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అఖిల్ తాజాగా ఏజెంట్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో సాక్షా వైద్య
హీరోయిన్ గా నటించగా ...
టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
మమ్ముట్టి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అనిల్
సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
హిప్ హాప్ తమిజ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయిన ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
సినిమా ఆశించదగ్గ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టుకోవడం లేదు. దానితో ఈ
మూవీ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలే ఉన్నాయి. ఇది ఇల్ ఉంటే ఏజెంట్ లాంటి భారీ ప్లాప్ తర్వాత
అఖిల్ తన తదుపరి
మూవీ ని మాత్రం అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
అఖిల్ తన తదుపరి
మూవీ ని
సాహో సినిమాకు అసిస్టెంట్
డైరెక్టర్ గా పని చేసినటు వంటి
అనిల్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ... యు
వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు ... అలాగే ఈ సినిమాలో
బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్
బ్యూటీ జాన్వి కపూర్ ...
అఖిల్ సరసన
హీరోయిన్ గా నటించబోతున్నట్లు అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ బృందం అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.