ఏంటి.. ఆ స్టార్ డైరెక్టర్ తో.. ప్రభాస్ మూవీ ఆగిపోయిందా?
అయితే ప్రభాస్ తో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయిందట. షారుక్ ఖాన్ హీరోగా దీపిక పదుకొనే హీరోయిన్గా జాన్ అబ్రహం విలన్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి కొత్త ఊపిరిని ఇచ్చింది. పఠాన్ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. అయితే ఇలా పఠాన్ సూపర్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా కోసం సిద్ధార్థ్ చర్చలు జరిపాడట.
ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధం అయ్యారట. ఇందుకు సంబంధించిన టాక్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలా ప్రభాస్, సిద్ధార్థ ఆనంద్ కాంబో సినిమా మాత్రం ఆగిపోయింది అన్నది తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇంతకుముందు మైత్రి మూవీస్ తో 65 కోట్లకు సంతకం చేసిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడట ప్రభాస్. దీంతో ఇక సిద్ధార్థ ఆనంద్, ప్రభాస్ మూవీ క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక ఈ ప్రాజెక్టును రూపొందించడానికి టీం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న.. ప్రస్తుతం ప్రయత్నాలన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది.