అలాంటి వాటికి చెక్ పెట్టిన రాశీ ఖన్నా..!!
అయితే ఇప్పటికి ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలు మాత్రం అందుకోలేకపోతోంది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేక పోతోంది రాశీ ఖన్నా.. ప్రస్తుతం ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది. హీరోయిన్లు తమ క్రేజ్ పెరగడానికి ఎక్కువగా సోషల్ మీడియా వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. రాశీ ఖన్నా కూడా సోషల్ మీడియాలో తరచూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
అయితే తాజాగా రాశీ ఖన్నా తనకు ట్విట్టర్ అకౌంట్ లేదని కేవలం ఇంస్టాగ్రామ్ లో మాత్రమే ఉన్నట్లుగా ధ్రువీకరించింది. ట్విట్టర్ నుంచి ఎలాంటి విషయాలు వచ్చిన సరే వాటిని షేర్ చేయకండి అంటూ తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో రాశీ ఖన్నా కు బాగా తెలుసు అందుకే అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్లను తెలియజేస్తూ అభిమానులను సంతోష పరుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ. అయితే తాజాగా ట్విట్టర్ లో లేనని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్ లో మాత్రం ఏ ఒక్క సినిమాలో నటించలేదు.