
మళ్ళీ భయపెట్టడానికి వస్తున్న పొలిమేర -2..!!
ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న మా ఊరి పొలిమేర-2 చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది .ఈ పోస్టర్లు ఒక వ్యక్తి మెడపై రక్తం కారుతూ ఉండగా తన రెండు చేతులను పైకి ఎత్తి దండం పెడుతూ మంటల మధ్యలో ఏదో అర్థనగ్నంగా కూర్చుని చూస్తున్నట్టు కనిపిస్తోంది. చాలా ఉత్కంఠంగా ఆసక్తికరంగా ఈ త్రిల్లింగ్ పోస్టర్ను చూసి ప్రేక్షకులు సైతం భారీ రెస్పాన్స్ లభిస్తుంది మొదటి భాగానికి మంచి సీక్వెల్ ఉండబోతోంది అంటూ డైరెక్టర్ తెలియజేయడం జరిగింది.
ఇందులో పనిచేసే నటీనటులు అంతా కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశామని తెలిపారు. ఈ సినిమా మొదటి భాగంలోనే పార్ట్-2 ఉందంటూ కూడా ప్రకటించారు. పొలిమేర -2 సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేశారు. తాజాగా మేకర్స్ తో పాటు ఈ సినిమాకి సంబంధించిన అందరిలోనూ ఈ సినిమాపై నమ్మకం ఉన్నట్లు తెలియజేశారు. హీరో రాజేష్ విషయానికి వస్తే ఇప్పటివరకు సుమారుగా 350కు పైగా సినిమాలలో నటించారు. హీరో సుమంత్ నటించిన సత్యం సినిమాతో మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి అగ్ర హీరోల సినిమాలలో కూడా నటించి మెప్పించారు.