టాలీవుడ్ రౌడీ
హీరో విజయ్ దేవరకొండ, సౌత్
బ్యూటీ సమంత కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్
మూవీ 'ఖుషి'. నిన్ను కోరి,
మజిలీ వంటి ప్యూర్
లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన
శివ నిర్వాణ ఈ
మూవీ ని డైరెక్ట్ చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ,
సమంత కాంబినేషన్లో రాబోతున్న మొదటి ఫుల్ లెన్త్
మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ఈ ఇద్దరు కలిసి
కీర్తి సురేష్ నటించిన 'మహానటి' సినిమాలో కీలకపాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు మెయిన్ లీడ్స్ గా నటించనుండడంతో సినీ లవర్స్ కూడా ఈ
మూవీ కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ
సినిమా సెప్టెంబర్ 1 విడుదల కాబోతోంది.
అయితే ఈ
సినిమా అటు
విజయ్ దేవరకొండకు ఇటు సమంతకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన
సమంత ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఇక శాకుంతలం వంటి ప్లాప్ తర్వాత తెలుగులో
సమంత నటిస్తున్న
సినిమా ఖుషి. అందుకే ఈ
సినిమా విజయం సాధించడం సమంతకు చాలా అవసరం. అటు రౌడి
హీరో విషయానికొస్తేమ్.. భారీ అంచనాల నడుమ విడుదలైన 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ
మూవీ రిజల్ట్ తో
పూరి జగన్నాథ్ తో తీయాల్సిన 'జనగణమన' ప్రాజెక్టు సైతం క్యాన్సిల్ అయిపోయింది. ఇక లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత
ఖుషి సినిమా చేస్తున్నాడు
విజయ్ దేవరకొండ.
ఈ
మూవీ తో ఎలాగైనా
సక్సెస్ సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు ఈ హీరో.కాబట్టి ఈ
మూవీ హిట్ అవడం ఇటు
విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమే. అసలే సినిమాకి
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ బ్లాక్ బస్టర్
మూవీ 'ఖుషి' అనే టైటిల్ ని ఈ సినిమాకి కూడా పెట్టారు. దానికి తోడు ఇది కూడా
లవ్ స్టోరీనే. కాబట్టి కచ్చితంగా ఈ
మూవీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ
ఖుషి పవన్
కళ్యాణ్ ఖుషిని మైమరిపిస్తుందేమో చూడాలి.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని,
రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్
ఇండియా లెవెల్ లో తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ,
కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు...!!