కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి
సూర్య గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సూర్య కేవలం
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో
సినిమా లను తెలుగు లో కూడా విడుదల చేసి
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా
తమిళ మరియు తెలుగు ఇండస్ట్రి లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న
సూర్య ప్రస్తుతం
శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే భారీ బడ్జెట్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో
దిశా పటాని ...
సూర్య సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని పది భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా బృందం ఈ
మూవీ టైటిల్ ను విడుదల చేస్తూ ఒక
పోస్టర్ ను విడుదల చేయగా ... ఈ
పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఈ
మూవీ సూర్య కెరియర్ లో ఇప్పటి వరకు ఏ
సినిమా కూడా రూపొందిని భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఈ
మూవీ పై
తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే చిత్రీకరణ దశలో ఉండగానే ఈ
మూవీ యొక్క డిజిటల్ హక్కులను భారీ ధరకు ఒక ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ
మూవీ యొక్క డిజిటల్ హక్కులను
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.