చాలా వివాదాలతో మే 5న "ది
కేరళ స్టోరీ"
సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ సినిమాని నిలిపివేయాలని నిరసనలు జరుగుతున్న నేపద్యంలో..
థియేటర్ దగ్గర భారీ బందోబస్త్ తో ఈ సినిమాని ప్రదర్శించారు. ఆ రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష నేతలు
థియేటర్ ముందు బాగా నిరసనలు చేపట్టారు. అలాగే సినిమాలో కూడా చాలా వివాదాస్పద సీన్లు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.ఇక ఈ సినిమాలో కేరళని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న రాష్ట్రంగా చూపించారని నాయకులు విమర్శిస్తున్నారు.అందుకే వెంటనే ఈ
సినిమా ప్రధర్శనని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు లో అయితే ఈ
సినిమా విడుదల నేపధ్యంలో స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో బాగంగానే తమిళనాడులో కూడా ఈ సినిమాపై చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.ఇక తమిళనాడు మాజీ
ముఖ్యమంత్రి ఇచ్చిన ఇంటర్వ్యూ ని తప్పుగా చూపించారని, దీంతో ప్రజలను ఎంతగానో తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఈ
సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ సినిమాని నిషేదించాలని హై కోర్టుకి వెళ్ళిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి తరుపున వాదనలు విన్న కోర్టు.. ఈ సినిమాకి సెన్సార్ అప్రూవ్ ఇచ్చిందని. ఈ సమయంలో సినిమాని నిలిపివేయాలని కోరడం సరికాదని తీర్పు కూడా ఇచ్చింది. దీంతో.. అక్కడ
సినిమా రిలీజ్ కి బాగానే లైన్ క్లియర్ అయ్యింది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి ఏమైనా ఉంటే
నిర్మాత చూసుకుంటాడాని కూడా చెప్పుకొచ్చింది. ఇక
సినిమా విషయానికి వస్తే కేరళలో తెప్పిపోయిన 32000 మంది అమ్మాయిల కథ ఆధారంగా ఈ
సినిమా తెరకెక్కింది. తప్పిపోయిన ఆ ఆమ్మాయిలని బాలవంతగా మతం మార్పించి ఉగ్రవాదులు చేస్తున్నారు అనెల సినిమాలో సీన్లు ఉండటంతో ఈ సినిమాపై వివాదాలు రాజుకున్నాయి. ఇక తాజాగా ఈ
సినిమా మే5న ప్రేక్షకుల ముందుకి వచ్చిన నేపధ్యంలో మరోసారి ఆందోళనలు ఎక్కువయ్యాయి.