మహేష్ బాబు నమ్రతల కాపురంలో చిచ్చు పెట్టిన స్టార్ హీరోయిన్.. అందుకే అంతపని చేసారా..!?

Anilkumar
టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు మరియు నమ్రత. మహేష్ బాబు కంటే నమ్రత నాలుగు సంవత్సరాలు పెద్దదైనప్పటికీ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. ఇప్పటికీ ఎలాంటి విభేదాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ జంట.ఇకపోతే నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. అనంతరం మహేష్ బాబుకి సంబంధించిన బిజినెస్ లను పిల్లలను చూసుకుంటూ బిజీ జీవితాన్నే గడుపుతుంది. నమ్రత బిజినెస్ బాధ్యతలను చేపట్టిన తర్వాత మహేష్ బాబు సినిమాల్లో మరింత బిజీగా మారాడు. ఎప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట గతంలో మాత్రం విడాకులు తీసుకోవాలని అనుకున్నారట. 

ఒక హీరోయిన్ కారణంగా నమ్రత మరియు మహేష్ బాబు ఇద్దరి మధ్యల తరచుగా గొడవలు వచ్చేవని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక వారిద్దరిమద్య అలాంటి గొడవలు రావడానికి కారణం మరెవరో కాదు హీరోయిన్ త్రిష.అయితే త్రిష కారణంగా గతంలో వీరిద్దరి మధ్య చాలా గొడవలు వచ్చాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నమ్రత మరియు మహేష్ బాబు ఇద్దరికీ మధ్య గొడవలు రావడానికి ముఖ్య కారణం గతంలో వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సైనికుడు అన్న సినిమా కూడా రావడం జరిగింది.

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్ తో కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే ఖచ్చితంగా వారిద్దరి మధ్య ఏదో ఉంది అని అంటారు. అయితే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. దీంతో వీరిద్దరూ కలిసి వరుసగా రెండు సినిమాల్లో నటించడంతో వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉంది అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. మెల్లగా ఈ విషయం కాస్త నమ్రతకి తెలిసింది. ఈ కారణంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వచ్చేవి అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త విన్న అనంతరం చాలామంది నటిజన్స్ ఎంతో అన్యోన్యంగా ఉండే మహేష్ బాబు నవ్రతలు కాపురంలో త్రిష వచ్చి చిచ్చు పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: