షాక్ :పంజా.. బాలు చిత్రం లాగే ఓజి కూడానా..?
ఓజి చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా అంతేకాకుండా డాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం .అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో బాలు మరియు పంజా సినిమాలో ఈ రకమైన కథనే తెరకెక్కించారు.అయితే ఇలా రెండుసార్లు తేరకెక్కించిన ఈ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. మరి ఈసారి ఓజి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ ఉండడంతో హరిహర వీరమల్లు సినిమా కంటే ఈ సినిమా ముందుగానే విడుదలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ సుజిత్ ను అభినందించాలి అంటు అభిమానులు తెలియజేస్తున్నారు. ఓజి మూవీ మూడో షెడ్యూల్ ఎక్కడ జరుపుకుంటారో అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా హైదరాబాదులోనే కొత్త షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ నటిస్తోంది ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.