ఇటీవల అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫ్యాషన్ మెట్ గాలా వేడుకలో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తన హోయలోలికించింది. నలుపు, తెలుపు రంగు గౌను వేసుకుంది ప్రియాంక చోప్రా. దాంతోపాటు మెడలో ఒక వజ్రాల నెక్లెస్ ను కూడా వేసుకుంది. ఆ వజ్రాల నెక్లెస్ ను వేసుకుని రెడ్ కార్పెట్ పై మెరిసిపోయింది ప్రియాంక చోప్రా. దీంతో ప్రియాంక చోప్రా వేసుకున్న ఆ వజ్రాల నెక్లెస్ ను చూసి దాని ధర ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఆమె ధరించిన నెక్లెస్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ప్రియాంక చోప్రా వేసుకున్న వజ్రాల హారం ధర ఏకంగా 204 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఈ ఏడాది మెట్ గాలా లో ప్రియాంక ఇటలీకి చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ బల్కరి రూపొందించిన 11.6 క్యారెట్ల వజ్రాలు నెక్లెస్ ను ధరించడం జరిగింది. అయితే వాటికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర 25 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే భారత కరెన్సీ ప్రకారం ఆ నెక్లెస్ ధర దాదాపుగా 204 కోట్లకు పైమాటే అన్నమాట.ఇకపోతే మెట్ గాలా పూర్తయిన తర్వాత ఆ నెక్లెస్ ను వేలం వేస్తారట. కాగా దానిపై బల్గరి సంస్థ గాని, మెట్ గాలా నుండి గాని ఎలాంటి స్పందన లేదు.
తాజాగా ఈ వేడుకలో ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి పాల్గొంది. అయితే ఆ వేడుకలో ప్రముఖ డిజైన్ వాలంటీనో రూపొందించిన గౌనులో మెరిసింది ప్రియాంక చోప్రా. ఇకపోతే ప్రియాంక చోప్రా ఇందులో పాల్గొనడం మొదటి సారి ఏమీ కాదు.ఈ వేడుకలో ప్రియాంక చోప్రా పాల్గొనడం ఇది ఐదవ సారి. దీనికంటే ముందు 2017, 2018 ,2019,2021 సంవత్సరంలో పాల్గొంది ప్రియాంక చోప్రా. ప్రఖ్యాత డిజైనర్ రాల్ఫ్ లారెన్ డయల్ బ్రాండ్ దుస్తులను వేసుకొని మెరిసిపోయింది ఈమె. ఇక ఈ వేడుకలో ప్రపంచాన్ని నలుమూలల నుండి వచ్చిన ఎందరో తారలతో పాటు మన దేశం నుండి కూడా కొంతమంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా తో పాటు ఈ వేడుకలో బాలీవుడ్ నటి అలియా భట్, ఈషా అంబానీ సైతం పాల్గొన్నారు..!!