అక్కినేని హీరోలు ప్రస్తుతం ఫామ్ లో లేరు. నాగార్జున సైతం డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. వైల్డ్ డాగ్ అంటూ అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్నాడు. తర్వాత నాగచైతన్య సైతం థాంక్యూ సినిమాతో బోల్తాపడ్డాడు. తాజాగా ఇప్పుడు అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ను అందించాడు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ ఎంతలా కష్టపడ్డాడో ఈ సినిమా కోసం ఎంత కష్టపడి తన బాడీని పెంచాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ సినిమా కోసం పడ్డ కష్టమంతా వృధా అయ్యింది .తాజాగా అఖిల్ తన ఏజెంట్ సినిమా ప్రమోషన్ కోసం రావడం జరిగింది.
ఈ సినిమా విడుదల కాకముందు ఈ సినిమా హీరో హీరోయిన్ సుమ షో కి రావడం జరిగింది .ఆ షోలో ఈ సినిమా గురించి చాలా పెద్ద హైప్ ఇచ్చాడు అఖిల్. తీరా చూస్తే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది .తాజాగా ఎప్పుడు ఈ షోలో అఖిల్ హీరోయిన్ సాక్షి వచ్చి ప్రమోషన్స్ చేస్తుండడంతో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సుమ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సుమ షో లో అఖిల్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ రామ్ చరణ్ అంటే
తనకి ఎంతో ప్రాణం అని రాంచరణ్ తన గుండె చప్పుడు అంటూ చెప్పాడు. అంతేకాదు ఇంట్లో నుండి గోడలు దూకి వెళ్లడం వంటి విషయాలు మా నాన్నకి ఇప్పటివరకు తెలియదు అని కొన్ని రహస్యాలను సైతం బయట పెట్టాడు. ఈ నేద్యంలోనే ఏ హీరోయిన్ తో డేటింగ్ కు వెళ్తావు అని సుమా అడిగింది.. వెంటనే పూజ హెగ్డే అంటూ సమాధానం ఇచ్చాడు అఖిల్. లేకపోతే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్యాచిలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటిసారి అఖిల్ కు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత పూజ హెగ్డే నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈ సినిమా రేంజ్ లో హిట్ ను అందుకోలేదు. దీంతో అఖిల్ పూజా హెగ్డే కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!