పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం వరుస
మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్
జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే పవన్ "వినోదయ సీతం" అనే
తమిళ మూవీ కి
రీమేక్ గా రూపొందుతున్న
సినిమా షూటింగ్ లో పాల్గొని తన సంబంధించిన షూటింగ్ భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నాడు. ఇలా ఇప్పటికే వినోదయ సీతం రీమిక్
మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న పవన్ ... ప్రస్తుతం
సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి"
మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ఈ
మూవీ ని ప్రముఖ
నిర్మాత డి
వి వి దానయ్య ... డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో
ప్రియాంక అరుల్
మోహన్ ... పవన్ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే
ముంబై లో ప్రారంభం అయింది. ఈ
మూవీ షూటింగ్ లో పవన్ తో పాటు
ప్రియాంక అరుల్
మోహన్ కూడా ఇప్పటికే జాయిన్ అయింది. వీరిపై కొన్ని సన్నివేశాలను కూడా ఈ
మూవీ బృందం ఇప్పటికే చిత్రీకరించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాలో
ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ... అలాగే ఈ
మూవీ షూటింగ్ లో
ప్రకాష్ రాజ్ తాజాగా జాయిన్ అయినట్లు ...
ప్రకాష్ రాజ్ పై
ముంబై లో చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు ఈ
మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఉంటే ఇది వరకే పవన్ ... ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో అనేక
మూవీ లు రూపొందాయి. అలాగే వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.