తన కెరియర్ పై.. సంయుక్త మీనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?
ఎందుకంటే హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సొంతం చేసుకుంటుంది. దీంతో అందరు డైరెక్టర్లకు కూడా సంయుక్త లక్కీ హీరోయిన్గా మారిపోయింది. మొన్నటికి మొన్న ధనుష్ సరసన నటించి సార్ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంయుక్త ఇటీవల మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో సంయుక్తా మీనన్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ఒక ముద్ర కూడా పడిపోయింది.
ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరియర్ ఆరంభంలో తనను ఎవరూ నమ్మలేదు అంటూ హీరోయిన్ సంయుక్త తెలిపింది. తాను ముందు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు కానీ వీధి సినిమాల్లోకి తీసుకువచ్చింది. ఇలా విధిరాత కారణంగానే నటి అయ్యాను. కెరియర్ ఆరంభంలో మంచి పాత్రలు చేయాలని ఉన్నప్పటికీ.. అప్పుడు నన్ను ఎవరు నమ్మలేదు. అందుకే అలాంటి పాత్రలు దక్కలేదని.. కానీ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నాను అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఇకపోతే ఇటీవలే విరుపాక్ష సూపర్ హిట్ కావడంతో ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.