అఖిల్ సినిమా విషయంలో ఫలించని నాగార్జున పూజలు...!!
అలాగే అఖిల్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకుని మరీ ఈ సినిమాను చేసాడు.. ఈయన రెండేళ్ల కష్టం తో ఈ సినిమా చేసి భారీ హోప్స్ ను అయితే పెట్టుకున్నాడు.
మరి ఎట్టకేలకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ''ఏజెంట్'' సినిమా ఈ రోజు థియేటర్స్ లో విడుదల అయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ అక్కినేని హీరో ఖాతాలో మరో ప్లాప్ పడినట్టే అని తెలుస్తుంది... ఎందుకంటే మొదటి షోతోనే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అఖిల్ కు మరో ప్లాప్ ను ఇచ్చాడు.. ఇప్పటికే వరుస ప్లాపుల తో అఖిల్ టాలెంట్ ఉన్న కానీ వెనుకబడి పోతున్నాడు.. మళ్ళీ ఇప్పుడు కూడా ప్లాప్ రావడం తో బాగా నిరాశ చెందుతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించగా తనయుడు సినిమా కోసం నాగార్జున, అమల తిరుమల శ్రీ వారిని కూడా దర్శించు కున్నారు.గురువారం అక్కడ పూజలు కూడా చేసారు.. అఖిల్ ఈ సినిమా కోసం నాగార్జున సపోర్ట్ ఏ మాత్రం కూడా తీసుకోలేదు. నాగ్ కూడా షూటింగ్ కూడా అంతగా రాలేదు... అఖిల్ మీద అంతా భారం వేసి వదిలేసాడు. అయితే ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది. కథ పరంగా ఏ మాత్రం కూడా దమ్ములేకుండా కేవలం హీరో పాత్ర మీదనే దృష్టి పెట్టడంతో ఫెయిల్ అయ్యాడు. అఖిల్ కాన్ఫిడెంట్ కూడా ఈ సినిమాకు ఏమాత్రం పని చేయలేదు..