'PSKDT' మూవీ టైటిల్ ఫిక్స్.. నిరాశలో ఫ్యాన్స్..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న ప్రాజెక్ట్స్ లో వినోదయ సీతం రీమేక్ కూడా ఒకటి. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న  ఈ సినిమాని తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయింది .ఈ ఏడాది జూలై 28న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాని #PSKDT అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ని వచ్చేవారం అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. 

ఇదివరకే ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట. గోపాలకృష్ణుడు, దేవుడే దిగివచ్చిన, నేనే కాలాన్ని.. అనే మూడు టైటిల్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ ఈ మూడు టైటిల్స్ కాకుండా మరో విభిన్నమైన టైటిల్ ని చిత్ర యూనిట్ కి సూచించినట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ పేరే 'పరదేశ ప్రయాణం'. అయితే ఈ టైటిల్ పట్ల పవన్ ఫ్యాన్స్ అయితే ఒకింత నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకి ఈ టైటిల్ ఏమాత్రం సరిపోలేదని చెబుతున్నారు. అంతేకాదు టైటిల్ కే సగం నీరసం వచ్చిందని.. ఇక సినిమా ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ అంతా తెగ భయపడిపోతున్నారు.

అయితే ఈ టైటిల్ కేవలం పవన్ కళ్యాణ్ సూచన మాత్రమే అని.. కానీ త్రివిక్రమ్ దృష్టిలో ఒక అద్భుతమైన టైటిల్ ఉందనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఆ టైటిల్ ఏంటో ఇంకా బయటికి రాలేదు.మరి ఇందులో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు 'టైం'.. అలాగే సాయి ధరంతేజ్ పేరు 'మార్కండేయ' అని చెబుతున్నారు. ఇక ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఆత్మను తీసుకొని పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టుగా రీమేక్ లో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని సముద్రఖని తీర్చిదిద్దారట. ఇక స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: