HBD: అలాంటివి కేవలం సమంతకు మాత్రమే సాధ్యమా..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన పేరు సంపాదించింది. 2010లో తన కెరియర్ ప్రారంభించి దాదాపుగా 12 సంవత్సరాలకు పైగా టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇప్పటికీ చేస్తున్న సినిమాలలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ రోజున సమంత పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమంత మొదటి చిత్రం నుంచి పలు విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించింది.

సమంత ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది. అలా నటించిన చిత్రాలలో రంగస్థలం సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

ఆ తర్వాత నాగచైతన్య సమంత వివాహం తర్వాత నటించిన మొదటి చిత్రం మజిలీ . ఈ చిత్రంలో తన భర్త మాటను ఎదిరించని భార్యగా నటించింది.ఈ సినిమా క్లైమాక్స్లో సమంత అద్భుతమైన నటనను ప్రదర్శించింది.

సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ఓ బేబీ ఇందులో ముసలి వ్యక్తిగా ఉన్న కొన్ని కారణాలవల్ల యవ్వనంలోకి వెళితే ఎలా ఉంటుంది అనే పాత్రలో కూడా అద్భుతంగా నటించింది

సమంత నటించిన మరొకచిత్రం యశోద ఈ చిత్రంలో అద్దె  గర్భం కాన్సెప్టులో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం సమంత పోరాట సన్నివేశాలు అదరగొట్టేలా  కనిపించాయి. ఇటీవలే శాకుంతలం సినిమాలో కూడా నటించి అద్భుతమైన నటన ప్రదర్శించింది.

ఇక పుష్ప సినిమాలో మొదటిసారిగా ఐటెం సాంగ్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది సమంత.
ఫ్యామిలీ మెన్-2 లో నటించి వెబ్ సిరీస్లలో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది తాజాగా హాలీవుడ్ యాక్షన్ త్రిల్లర్ సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో లీడ్ రోల్ నటిస్తోంది. సమంత . ఇలా ఇన్ని అద్భుతమైన వేరియేషన్స్ కలిగిన పాత్రల సమంతకు మాత్రమే నటించిందని చెప్పవచ్చు. ఇక సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఈమె ఎక్కువగా కష్టాలు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: