సురేందర్
రెడ్డి దర్శకత్వంలో అక్కినేని
అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్
మూవీ 'ఏజెంట్'. స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో
అఖిల్ ఇండియన్ సీక్రెట్
రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక
సాక్షి వైద్య
హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ
మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
అనిల్ సుంకర, రామబ్రహ్మం
సుంకర భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ రేపు (ఏప్రిల్28) ప్రపంచవ్యాప్తంగా ఈ
సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఏజెంట్
మూవీ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.
బాలీవుడ్ సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
ఏదైనా పెద్ద
సినిమా విడుదలవుతుందంటే రిలీజ్ కి ముందే ఇతను రివ్యూ ఇస్తాడు. తాజాగా ఏజెంట్ మూవీకి కూడా రివ్యూ ఇచ్చాడు. ఈ మేరకు ఉమైర్ సందు ఈ
మూవీ గురించి చెబుతూ..' ఏజెంట్
మూవీ సోల్ లేని
బ్యూటిఫుల్ బాడీ అంటూ పేర్కొన్నాడు. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని,
మమ్ముట్టి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని, అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే బాలేదని సినిమాకు అవే పెద్ద మైనస్' అంటూ వెల్లడించాడు. అంతే కాదు
అఖిల్ ఇంకా యాక్టింగ్ క్లాసులకు వెళ్లాలని పలు విమర్శలు చేశాడు. ఇక ఫైనల్ గా ఏజెంట్ సినిమాకు 2/5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఈ
బాలీవుడ్ క్రిటిక్ గతంలో పలు పెద్ద సినిమాలకు రిలీజ్ కు ముందు
సినిమా బాలేదని రివ్యూ ఇచ్చాడు.
కానీ రిలీజ్ తర్వాత ఆ సినిమాలు
బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కాబట్టి ఏజెంట్
సినిమా కూడా బాలేదని చెప్తున్నాడు అంటే కచ్చితంగా ఈ
మూవీ రేపు రిలీజ్ తర్వాత
బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్
మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఈ సినిమాపై
అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. సినిమాలో స్పై రోల్ కోసం ఏకంగా 8 ప్యాక్స్ బాడీని బిల్డ్ చేశాడు ఈ అక్కినేని హీరో. అందుకోసం నెలల తరబడి డైట్ కూడా ఫాలో అయ్యాడు. మరి అంతలా కష్టపడ్డ
అఖిల్ కి ఏజెంట్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి...!!