అక్కినేని
అఖిల్ ... బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో
పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే
సక్సెస్ ఫుల్
మూవీ తర్వాత ఏజెంట్ అనే స్పై యాక్షన్
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి దర్శకత్వం వహించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత అనిల్
సుంకర ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
సాక్షి వైద్య
హీరోయిన్ గా నటించిన ఈ
మూవీ కి హిప్ హాప్ తమీజ సంగీతం అందించగా ...
మమ్ముట్టి ఈ
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ బృందం వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అక్కినేని
అఖిల్ ఈ
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో
అఖిల్ "ఏజెంట్"
మూవీ గురించి మాట్లాడుతూ ... నా మైండ్ లో ఒకటే ఉంది. ఈ
మూవీ తర్వాత నేనేమైపోతానో అని ఫీలింగ్ ఉంది. ఇంత హైలో
మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలాంటి
సినిమా చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు అని
అఖిల్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా అంటే ఈ
మూవీ బృందం ఇప్పటి వరకు ఈ
సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ
మూవీ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.