తనకు కాబోయే వరుడు.. ఎలా ఉండాలో చెప్పిన ఫైమా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమేడియన్స్ గుర్తింపు సంపాదించుకున్నారు. అప్పటివరకు అపరిచితులుగా ఉన్నవారు.. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా జబర్దస్త్ ద్వారా సుపరిచితులుగా మారిపోయారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో అటు జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ ది కూడా ఎక్కువగా హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ఈ కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్స్ లో అటు ఫైమా కూడా ఒకరు. పటాస్ అనే కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ప్రస్తానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత జబర్దస్త్ తో ఒక్కసారిగా గుర్తింపు సంపాదించుకుంది.

 ఇక జబర్దస్త్ ద్వారా తనదైన రీతిలో కామెడీ పంచులు వేసి ఇక ప్రేక్షకులను నవ్వించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లడం ద్వారా ఆర్థికంగా స్థిరపడింది. అంతేకాదు ఇక బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా మరింత దగ్గర అయింది ఈ జబర్దస్త్ కమెడియన్. అయితే ఆ తర్వాత మాత్రం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైంది. ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే పలు షోలలో ఫైమ సందడి చేస్తూ ఉంది. ఇకపోతే ఇటీవల స్టార్ మా పరివార్ కార్యక్రమంలో పాల్గొన్న ఫైమా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి.. అతనికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 తనకు కాబోయే వాడు తనను ఎంతో కేరింగా చూసుకోవాలని.. ఏకంగా చిన్న పిల్లలాగా చూసుకోవాలి అంటూ చెప్పుకొచ్చింది పైమ. అంతేకాకుండా ప్రతి విషయంలో తనకు సపోర్ట్ చేయాలి అని.. మంచివాడు అయ్యుండాలి అంటూ తెలిపింది. అదే గతంలో ఫైమా పటాస్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్నో రోజులపాటు వీరిద్దరి జోడి జబర్దస్త్ స్టేజ్ పై సందడి చేసింది. కానీ ప్రస్తుతం పైమా జబర్దస్త్ కు దూరం కావడంతో వీరిద్దరూ వారి వారి కెరియర్ లో బిజీబిజీగా ఉన్నారు. ఎక్కడ కలిసి కనిపించడం లేదు. అయితే జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇస్తానని గతంలో ఫైమా చెప్పింది. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: