అమ్మోరు దయతో విడాకులు.. వింతగా కృతజ్ఞతలు తెలిపిన యువకుడు!

Amruth kumar
సాధారణంగా పెళ్ళాం విడిపోతుందంటే ఏ భర్త అయినా కన్నీళ్లు పెట్టుకుంటాడు, గుండెలు బాదుకుంటాడు. కానీ, ఈ కలికాలంలో సీన్ రివర్స్ అయ్యింది! తన భార్య నుంచి విడాకులు మంజూరు అయ్యాయన్న ఆనందంలో ఒక యువకుడు ఏకంగా 9 కిలోమీటర్ల సాష్టాంగ దండాలు పెడుతూ ఆలయంలో మొక్కు తీర్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘వార్నీ . .. విడాకుల కోసం ఇలాంటి మొక్కులా?’ అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. .


యూపీలోని సోన్హా ప్రాంతానికి చెందిన జోగేష్ ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.2022లో పెద్దల సమక్షంలో ఒక యువతితో జోగేష్‌కు వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అంతా బాగున్నా, ఢిల్లీకి వెళ్లాక ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్తా ముదిరి విడాకుల వరకు వెళ్లాయి.భార్యతో వేగలేకపోయిన జోగేష్, ఎప్పుడెప్పుడు విడాకులు వస్తాయా అని ఎదురుచూశాడు. ఒకవేళ కోర్టు నుంచి విడాకులు మంజూరైతే, బైడవా సమయ్ మాత ఆలయానికి 9 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వస్తానని మొక్కుకున్నాడు. .



తాజాగా కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేయడంతో, జోగేష్ ఆనందానికి హద్దుల్లేవు. చెప్పినట్టుగానే నేలపై పడుకుంటూ, లేస్తూ 9 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మొక్కు తీర్చుకున్నాడు. దీనికోసం అతనికి దాదాపు 12 గంటల సమయం పట్టిందట!ఈ వింత మొక్కుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సునామీ సృష్టిస్తోంది.“భార్య బాధితుల సంఘం అధ్యక్షుడిగా ఇతనిని ఎన్నుకోవాలి” అని కొందరు జోకులు వేస్తుంటే, “పాపం ఆ భార్యతో అతను ఎంత ఇబ్బంది పడితే ఇలాంటి మొక్కు మొక్కుకుంటాడు” అని మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పుడు విడాకులు అంటే ఒక విషాదం.. కానీ ఇప్పుడు ‘డివోర్స్ పార్టీలు’, ఇలాంటి వింత మొక్కులతో విడాకులు కూడా ఒక సెలబ్రేషన్ లా మారిపోతున్నాయి . .





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: