బిచ్చగాడు సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సాట్నా టైటాస్ అందంతో నటనతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇమే నీది నాది ఒకే కథ లో కూడా నటించింది.ఆ తర్వాత తమిళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది.. చేసింది తక్కువ సినిమాలో అయినా అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఇండస్ట్రీ నుంచి దూరం అయింది.సాట్నా టైటాస్ 1991 నవంబర్ 28న కేరళలో కొచ్చిలో జన్మించినది డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
అలా మొదటిసారిగా బిచ్చగాడు సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం పలు చిత్రాలలో నటించిన ఈమె పలు వివాదాలతో కూడా వార్తలలో నిలుస్తూ ఉండేది ముఖ్యంగా కెరియర్ మంచిగా సాగుతున్న సమయంలో బిచ్చగాడు సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూషన్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అతనితో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా మార్చింది. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరూ రిజిస్ట్రేషన్ వివాహం చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి పై ఆమెతల్లి అప్పట్లో పోలీస్ స్టేషన్ ని కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఈమె కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.