బుల్లితెర హాట్ యాంకర్
శ్రీముఖి తాజాగా ఓ సెన్సేషనల్ డెసిషన్ తీసుకుందట. ఆమె తీసుకున్న డిసిషన్ కి ఫాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె తీసుకున్న డిసిషన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. ఇకపై శ్రీముఖికి
హీరోయిన్ ఆఫర్స్ వచ్చినా కూడా నటించదట. అదేంటి? యాంకర్ గా ఉన్న శ్రీముఖికి
హీరోయిన్ ఆఫర్స్ వస్తే చేకపోవడమేంటి? అని అనుకుంటున్నారా? అయితే ఇందుకు
శ్రీముఖి దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉందంట. నిజానికి
శ్రీముఖి నటి కావాలని ఇండస్ట్రీకి వచ్చింది. ఈ అమ్మడు యాంకర్ కాకముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్
బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత
అల్లు అర్జున్ నటించిన
జులాయి సినిమాలో బన్నీకి చెల్లిగా నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన అవి ఆమెకు గుర్తింపును తేలేకపోయాయి.
సినిమాల్లో చిన్నాచితగా పాత్రలు చేస్తే గుర్తింపు రావడంలేదని బుల్లితెర వైపు అడుగులు వేసింది శ్రీముఖి. అలా 2013లో
పటాస్ షో ద్వారా
శ్రీముఖి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ షోతో శ్రీముఖికి భారీ గుర్తింపు వచ్చింది. అక్కడితో మెల్లమెల్లగా ఎదుగుతూ స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ బిజీగా గడుపుతోంది. ఏ
టీవీ షో చేసిన అందులో కచ్చితంగా
శ్రీముఖి యాంకరింగ్ ఉండాల్సిందే. అలా బుల్లితెరపై నటిస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. చివరగా
శ్రీముఖి నితిన్ నటించిన మ్యాస్ట్రో మూవీలో కనిపించింది. అయితే ప్రస్తుతానికి దర్శక నిర్మాతలు శ్రీముఖికి
హీరోయిన్ ఆఫర్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటే తాను మాత్రం సింపుల్ గా వాటిని రిజెక్ట్ చేస్తుందట. దానికి ప్రధాన కారణం చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అలా నటిస్తే ఉన్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుందని ఆమె ఆలోచిస్తుందట. అందుకే కొత్తగా వస్తున్న చిన్న నిర్మాణ సంస్థలు, డెబ్యూ డైరెక్టర్స్డెబ్యూ హీరోల సినిమాలో నటించేందుకు
శ్రీముఖి అంత సముఖంగా లేదట. చిన్న సినిమాల్లో నేను నటించను అని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. అయితే
శ్రీముఖి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం వెనక మరో యాంకర్
రష్మి గౌతమ్ ఉందని అంటున్నారు. ఎందుకంటే
రష్మీ గౌతమ్ కెరియర్ చూసి
శ్రీముఖి ఈ నిర్ణయం తీసుకుందట. యాంకర్ గా ఫామ్ లో ఉన్న సమయంలో రష్మి వరుసగా సినిమాలు చేసింది. అవన్నీ కూడా ప్లాప్ అవ్వగా.. ఇప్పుడు ఆమెను పట్టించుకునే వాళ్లే లేరు. అందుకే
శ్రీముఖి కూడా చిన్న సినిమాల్లో నటించకూడదని డెసిషన్ తీసుకుందట. అలాగే
జబర్దస్త్ యాంకర్
అనసూయ మాదిరిగా తెలివిగా పెద్ద సినిమాల్లో నటించాలని తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుందట...!!