టాలీవుడ్ యువ నటుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా సస్పెన్స్ ... థ్రిల్లర్ ... హర్రర్ జోనర్ కథతో రూపొందినటు వంటి విరూపాక్ష అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో వరుస విజయాలతో ప్రస్తుతం కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా ... దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.
మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నాయి. ఈ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లు వచ్చాయి. అలాగే మూడవ రోజు కూడా ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తాజాగా సోషల్ మీడియా వేదికగా విరూపాక్ష మూవీ గురించి రామ్ చరణ్ స్పందిస్తూ ... కంగ్రాట్స్ మై బ్రదర్ సాయి ధరమ్ తేజ్. "విరూపాక్ష" మూవీ గురించి చాలా మంచి టాక్ వింటున్న అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ "విరూపాక్ష" మూవీ గురించి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.