ఆ నెల వరకు "గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ పూర్తి కానుందా..?

frame ఆ నెల వరకు "గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ పూర్తి కానుందా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీయార అద్వాని ... చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే రామ్ చరణ్ ... కియార అద్వానీ కలిసి వినయ విధేయ రామ అనే సినిమాలో జోడిగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కాక పోతే వీరిద్దరి జంటకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.


ఇది ఇలా ఉంటే గేమ్  చేంజర్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో లేదా ... వచ్చే సంవత్సరం జనవరి నెలలో లేదా ... వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకా 60 రోజుల మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మొత్తం షూటింగ్ ను ఆగస్టు నెల వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని పాటలను ... యాక్షన్స్ సన్ని వేశాలను భారీ బడ్జెట్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: