తన బిడ్డ కోసం పూర్తి సమయాన్ని కేటాయించబోతున్న రామ్ చరణ్...!!
ట్రిపుల్ ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకుని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సొంతం చేసుకున్న చరణ్ తరువాత సినిమాపై ఫ్యాన్స్ అంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్'' సినిమా ఒకటి.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి... ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఇది పక్కన పెడితే రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడనీ సమాచారం.
పెళ్లి అయ్యిన 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీ చాలా సంతోషంగా వుంది.. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు వస్తాడా అని మెగా కుటుంబంతో పాటూ మెగా ఫ్యాన్స్ కు బాగా ఎదురు చూస్తున్నారు.. మరొక నెలలోనే మెగాస్టార్ ఇంట ఒక బిడ్డ రాబోతున్న నేపథ్యంలో రామ్ చరణ్ బిడ్డరాక ముందు నుండే తన భార్యాబిడ్డతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడనీ తెలుస్తుంది.ఇప్పుడు చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మాత్రమే కాకుండా ఉప్పెన డైరెక్టర్ తో కూడా తరువాత సినిమా చేయనున్నాడు.. ఈ క్రమంలోనే షూటింగులకు అన్నిటికి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నారనీ తెలుస్తుంది.. ఇప్పటికే ఉపాసనకు నెలలు నిండుతున్నాయనీ తెలుస్తుంది... వచ్చే నెల బిడ్డ పుట్టే అవకాశం కూడా ఉంది.. అందుకే చరణ్ ముందుగానే తన భార్య బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించాలని లాంగ్ లీవ్ తీసుకుంటాడంటూ ప్రచారం కూడా జరుగుతుంది.. దాదాపు 2 నెలల పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడనీ సమాచారం..