ట్విట్టర్లో బ్లూటిక్ కోల్పోయిన సెలబ్రిటీస్..!!
ట్విట్టర్ తీసుకొచ్చిన కొన్ని నిబంధనల ప్రకారం ఇప్పుడు ట్విట్టర్ బ్లూ కోసం చెల్లించే వారికి మాత్రమే ఈ బ్లూ టిక్స్ మార్కులను ఇస్తుందట. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోని ఖాతాలకు మాత్రమే ఇలాంటి బ్లూటిక్స్ ను తొలగిస్తానని ట్విట్టర్ కంపెనీ సీఈవో ఎలన్ మాస్క్ గత కొన్ని నెలల క్రితం ప్రకటించడం జరిగింది.. అయితే ఈ బ్లూ టిక్స్ కావాలంటే కచ్చితంగా నెలనెలా చార్జీలు చెల్లించాలని తెలియజేశారు. అనుకున్నట్టుగానే నిన్నటి రోజున రాత్రి నుంచి పలువురు ప్రముఖుల బ్లూ టిక్స్ ను తొలగించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని ఖాతాల నుంచి కూడా బ్లూ టీం తొలగిస్తామని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాలవల్ల బ్లూటిక్స్ తొలగించకపోయిన ఆ తర్వాత ఎలన్ మాస్క్ వీటిలో ఏప్రిల్ నుంచి కచ్చితంగా లెగసి వెరిఫైడ్ ఖాతాల ముందు ట్విట్టర్ బ్లూటూత్ మార్కు తొలగించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. వారికి మాత్రమే బ్లూటూత్ కంటిన్యూ అవుతోందని సమాచారం.. అలా ఇప్పటివరకు కేటీఆర్ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రాజమౌళి మాత్రమే బ్లూ టిక్ కలిగి ఉన్నారు. ఈ బ్లూటూత్ తొలగించడంపై బీజేపీ లీడర్ కుష్బూ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా తొలగిస్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తోంది.