"పొన్నియన్ సెల్వన్ 2" కు "యూఎస్ఏ" లో అదిరిపోయే ప్రీ సేల్స్..!

Pulgam Srinivas
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం కొంత కాలం క్రితం "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1" మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. తమిళం లో రూపొందిన ఈ మూవీ ని ఏక కాలంలో తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో విక్రమ్ , జయం రవి , కార్తీ , త్రిష , ఐశ్వర్య రాయ్ , శోభిత ధూళిపాల కీలకమైన పాత్రలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అద్భుతమైన విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా రెండవ భాగం మరి కొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.


ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను .అరియు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన "యూ ఎస్ ఏ" బుకింగ్ లను ఈ చిత్ర బృందం ఓపెన్ చేసింది.


ఈ మూవీ ఫ్రీ సేల్స్ బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ యొక్క రెండవ భాగం పై "యూ ఎస్ ఏ" ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా యొక్క రెండవ భాగం ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: