చీరకట్టులో నడుమందాలతో మైమరపిస్తున్న కీర్తి సురేష్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అద్భుతమైన నటి అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. నాని హీరో గా రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు. మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.
 


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి ... చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా రూపొందుతున్న భోళా శంకర్ అనే మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. ఆగస్టు 11 వ తేదీన  ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 


అందులో భాగంగా తాజాగా కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కీర్తి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: