రామ్ చరణ్ వల్ల.. సల్మాన్ ఖాన్ హిట్టు కొట్టేనా..?
ఇందులో విక్టరీ వెంకటేష్ పూజ హెగ్డే కు అన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే విలన్ గా జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు. గత ఏడాది వరస ప్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే కు ఈ ఏడాదైనా కలిసి వస్తుందేమో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా గెస్ట్ పాత్రలో కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది. దీంతో ఈ సినిమా స్క్రీన్లు కూడా అత్యధికంగా కూడా వీక్షించే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పూజా హెగ్డే ఈ సినిమా పైన పూర్తిగా ఆధారపడిందని చెప్పవచ్చు.
అందుచేతను ఈ సినిమా కోసం ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది పూజా హెగ్డే. ఈనెల 21వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. గత ఏడాది చివరిలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సర్కస్ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం తెలుగులో పాటు తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా పరువు సినిమాలలో నటిస్తోంది పూజా హెగ్డే తెలుగులో మహేష్ తో ఒక సినిమాలో నటిస్తోంది ఈ చిత్రానికి సంబంధించి పలు ఫోటోలు లీక్ అయినట్లుగా తెలుస్తోంది.