తను రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పిన టిల్లు..!
సినిమా నుంచి డైరెక్టర్ ఎగ్జిట్ నుంచి మొదలు పెడితే హీరోయిన్స్ తో సిద్ధు గొడవ ఇలా చాలా రకాల వార్తలు వచ్చాయి. వీటిపై ఎప్పుడూ స్పందించని సిద్ధు ఫైనల్ గా జర్నలిస్ట్ ప్రేమ తో స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించాడు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అని ముందే ఫిక్స్ అయ్యామని కానీ మధ్యలో రకరకాల వార్తలు వచ్చాయని. అనుపమ సెట్స్ నుంచి వెళ్లినట్టు కూడా రాసుకొచ్చారని చెప్పాడు.
అంతేకాదు తను టిల్లు స్క్వేర్ ని డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణని డైరెక్ట్ చేయొద్దని చెప్పినట్టు రాసుకొచ్చారు. విమల్ కృష్ణకి ఫోన్ కలిపి మాట్లాడాడు సిద్ధు. ఇక మల్లిక్ రాం తో తను రిలేషన్ షిప్ లో ఉన్నానని.. తను నాతోనే ఉంటాడు.. నాతోనే తింటాడని బోల్డ్ గా చెప్పాడు సిద్ధు. టిల్లు స్క్వేర్ కూడా అమ్మాయి వల్ల సమస్యలు వాటి కోసం టిల్లు తిప్పలు ఉంటాయని ఈసారి సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అన్నాడు. మొత్తానికి టిల్లు స్క్వేర్ పై వచ్చిన వార్తలన్ని ఎవరో సృష్టించినవే అన్నది తేలిపోయింది. డీజే టిల్లుపై అంచనాలు లేకుండా వచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయ్యింది టిల్లు స్క్వేర్ మీద భారీ క్రేజ్ ఉంది మరి వాటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ఎలా తీస్తున్నారో అన్నది చూడాలి.