పుష్ప 2 స్పెషల్ సాంగ్ కి స్పెషల్ పర్సన్..!
ఇక ఫస్ట్ లుక్ టీజర్ తర్వాత పుష్ప 2 మీద నార్త్ సైడ్ కూడా క్రేజ్ డబుల్ అయ్యింది. ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా ని అక్కడ ఆడియన్స్ కి మరింత ఎక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అందుకే పుష్ప 1 లో మిస్సైన ఎలిమెంట్స్ పార్ట్ 2 లో పెడుతున్నాడట. పుష్ప 1 లో ఉ అంటావా మావ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.
అయితే దాన్ని మించేలా పుష్ప 2 లో సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. పుష్ప 2 లో కూడా సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా అని చూస్తే సమంత నో అనేసింది. సో సమంత కాకుండా పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేసే ఆ స్పెషల్ పర్సన్ ఎవరన్నది చూడాలి. అయితే సుకుమార్ ఈసారి ఉ అంటావా కాదు అంతకుమించి అనిపించేలా ఈ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడట. సమంత ప్లేస్ లో బాలీవుడ్ హాట్ భామని రంగంలోకి దించుతున్నాడని తెలుస్తుంది. మరి ఆ స్పెషల్ సాంగ్ కి కాలు కదిపే ముద్దుగుమ్మ ఎవరో తెలియాల్సి ఉంది.