టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యకాలంలో ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నాడు. అలా ప్రయోగాలు చేసి బాగా దెబ్బతింటున్నాడు. నిజానికి హీరోగా రవితేజ ప్లస్ పాయింట్స్ కామెడీ, యాక్షన్. ఇది అందరికి తెలిసిందే కదా. కానీ ఎందుకనో ఈ మధ్య ఎక్కువగా రవితేజ సీరియస్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అలా చేసిన సినిమాలు ప్లాప్స్ అయినా రవితేజ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇటీవల ఆయన నటించిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర ఈ రెండు సినిమాల రిజల్ట్ ఒక్కటే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలకు రవితేజ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించాడు.
నిర్మాతగా ఉన్నారంటే ఈ రెండు సినిమాల రిజల్ట్ పై రవితేజకి ఎంతో నమ్మకం ఉండి ఉంటుంది. కానీ కట్ చేస్తే.. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన రిజల్ట్ ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రవితేజ ఇప్పుడు నిర్మాణరంగంలో రాణించలేకపోతున్నాడని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రవితేజ నిర్మించిన సినిమాలేవి సక్సెస్ అవ్వలేదు. ఇప్పటివరకు రవితేజ తన సొంత బ్యానర్ పై రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలతో పాటు తమిళంలో విష్ణు విషయాలు నటించిన 'FIR, మట్టి కుస్తీ సినిమాలను నిర్మించాడు. ఈ కోలీవుడ్ సినిమాలు కూడా రవితేజకు నిరాశనే మిగిల్చాయి.
దీంతో రవితేజ తన ప్రొడక్షన్ హౌస్ పేరు మారిస్తే బాగుంటుందని అతని సన్నిహితులు రవితేజ కి సలహా ఇచ్చారట. కానీ రవితేజ వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకోడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రవితేజ సినిమాలను నిర్మించడం మానేస్తే బాగుంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక తాజాగా రావణాసుర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సువర్తపురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక రవితేజ కెరీర్ లో ఇది మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమా అనంతరం కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' అనే సినిమా చేస్తున్నాడు రవితేజ...!!